గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ప్రతిష్ఠాత్మక సంస్థలు తమ కార్యాలయాలను నెలకొల్పుతున్నాయి. ఔటర్ రింగ్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద బహుళ అంతస్థుల భవనం కూడా హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నిర్మితమవుతున్నది. కోకాపేటలో ‘సాస్ క్రౌన్’ పేరిట 58 అంతస్థులు, 236 మీటర్ల ఎత్తుతో ఈ ఆకాశ హార్మ్యాన్ని నిర్మిస్తున్నారు.
హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు పక్కనే కొలువుదీరుతున్నఈ భవనంలో ఇప్పటికే సుమారు 100 మీటర్ల ఎత్తు.. 24 అంతస్థుల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 136 మీటర్ల నిర్మాణం మరో ఏడాదిలో పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. ఐటీ కారిడార్‌లో ఇప్పటికే పలు భారీ భవనాలు ఏర్పాటయ్యాయి. 57, 56, 52, 50 అంతస్థులతో కూడిన భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే, 58 అంతస్థులతో సాస్ క్రౌన్ దక్షిణ భారతంలోనే అతి పెద్ద భవనంగా రికార్డు సృష్టించనుంది.
A tower in the under-construction SAS Crown has now reached 100 metres in height!
136 metres more to go for it to reach its proposed height of 236 meters, likely topping out sometime in 2024.
Source : SAS Infra/IG pic.twitter.com/GA0K4T5mn3
— Hyderabad Mojo (@HyderabadMojo) April 1, 2023