నిజామాబాద్ జిల్లా: నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో కురుమే సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య 96వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ డిటిసి డెలిగేట్ దేవిదాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అలాగే కురుమ జాతి రత్నమని కొనియాడారు. ఆయన చేసిన పోరాటాలు యువకులు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డిటిసి డెలిగేట్ దేవి దాస్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జుంజుర్ నగేష్ , కాంగ్రెస్ నాయకులు ఈ రవి, ఈ సంజీవ్, గంగాధర్, కురుమ సంఘం నాయకులు కరెంట్ భూమేష్ మ తదితరులు పాల్గొన్నారు.