నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ అర్బన్ లో; YSR తెలంగాణ పార్టీ అధినేత్రి YS షర్మిలమ్మ రాష్ట్ర పార్టీ కార్యాలయం లోటస్ పాండ్ లో పార్టీ నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ ఇంచార్జ్ బుస్సాపూర్ శంకర్ కలవడం జరిగింది. అనంతరం నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలను షర్మిలమ్మకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా బుస్సాపూర్ శంకర్ పార్టీ తరుపున నిర్వహిస్తున్న కార్యములు బాగున్నాయని , ఇలాగే కార్యక్రమాలు కొనసాగిస్తూ , పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ షర్మిల సూచించారు. బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ పార్టీని నియోజకవర్గంలో షర్మిలమ్మ ఆదేశాల మేరకు ఇంకా ఉత్సాహంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తాని , నిజామాబాద్ గడ్డ మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఎగరేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు