- మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రధాన రహదారి పై అంబులెన్స్ యాజమాన్యాల వ్యవహార తీరు పై ధర్నా చేసిన జర్నలిస్టులు..
- అంబులెన్స్ యాజమాన్యాల ప్రెసిడెంట్ ,వైస్ ప్రెసిడెంట్ పై కేసులు నమోదు చేయాలని జర్నలిస్టుల డిమాండ్ చేశారు
మందమర్రి కి చెందిన జర్నలిస్ట్ బొడ్డు రవి మూడు రోజుల క్రితం జరిగిన బైక్ ప్రమాదంలో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఈక్రమంలో…
హైదరబాద్ నుండి డెడ్ బాడీ తీసుకు వచ్చిన అంబులెన్స్ వారిని భయబ్రాంతులకు గురి చెసి డెడ్ బాడీని దింపి తమకు చెందిన అంబులెన్స్ లో తరలించాలని బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారు.
వీరికి సంబంధం లేకున్నా
ఓ జర్నలిస్ట్ మృత దేహం ఇంటికీ తీసుకు వెళ్ళడానికి తమకు 2 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన అంబులెన్స్ మాఫీయా వ్యవహారం తీరుపై మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ఐబీ చౌరస్తా లో రాస్తా రోకో చేపట్టిన జర్నలిస్ట్ లు..
ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న అంబులెన్స్ యాజమాన్యాల అధ్యక్షుడు ఉపాధ్యక్షుడుల పై విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసిన జర్నలిస్ట్ లు..
విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని పోలీస్ లు హామీ… పోలీస్ ల హామీతో ఆందోళన ను విరమించిన జర్నలిస్ట్ లు..
అంబులెన్స్ ల యాజమాన్యాల వారు గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి . వీరి ఆగడాలను పోలీసులు అదుపులో పెట్టాలని మధ్యతరగతి వారిని పిడించుకు తింటున్న అంబులెన్స్ యాజమాన్యాలపై కేసుల నమోదు చేయాలని గతంలో పలువురు డిమాండు చేశారు…