సంగారెడ్డి : రాష్ట్రంలో ఇటీవల వీధి కుక్కల దాడుల బాధితులు పెరిగిపోతున్న తీరు జనాలను భయాందోళన గురిచేస్తుంది. చివరికి రోడ్లపై వెళ్తున్న పిల్లలపై, సామాన్య జనంపైనే కాదు.. ఏకంగా కలెక్టరేట్ లలోనూ వీధి కుక్కలు వీరంగం చేసి అదనపు కలెక్టర్ ను గాయపరిచిన ఘటన తాజాగా సంచలనం రేపింది. పాపం వీధి కుక్కలకు తెలవదు.. ఆయన అదనపు కలెక్టర్ అన్న సంగతి.. తమ సహజ ప్రతాపాన్ని ఆయనపై కూడా ప్రదర్శించి కరిచి కాళ్ల పిక్కలు పీకేశాయి ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే సిద్దిపేట కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం రాత్రి సిద్దిపేట అదనపు కలెక్టర్( రెవిన్యూ) శ్రీనివాస్ రెడ్డి తన నివాస క్వార్టర్స్ ఆవరణలో వాకింగ్ చేస్తుండగా ఓ వీధి కుక్క ఆయనపై దాడి చేసి కరిచింది.
