కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని జంగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరాటే మాస్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాలికల స్వీయ రక్షణకై 30 రోజుల పాటు నిర్వహించిన కరాటే శిక్షణ కార్యక్రమం నేటితో ముగిసింది. బాలికలు ఊహించని పరిణామాలు ఎదురైనప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలో చక్కని మెలకువలను కరాటే శిక్షణ ద్వారా మాస్టర్ శ్రీనివాస్ విద్యార్థులకు నేర్పించారు. ఇట్టి శిక్షణ కార్యక్రమం నేటితో ముగిసినందున కరాటే మాస్టర్ శ్రీనివాస్ కి జంగపల్లి గ్రామ సర్పంచ్ అట్టికం శారద శ్రీనివాస్,పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అనవేని మల్లేశం, ప్రధానోపాధ్యాయులు సూర సుమలత ఉపాధ్యాయులు సన్మానించారు.