contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హాస్టల్ బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని

  •  ఈ గతకానికి బాధ్యులు ఎవరు..?
  •  గర్భవతి అని తెలిసి అనుమతులు ఎలా ఇచ్చారు..
  •  భద్రత లేని గురుకుల బాలికల పాఠశాలలు

సంగారెడ్డి: తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించి మంచి జీవితాన్ని గడపాలనుకున్న తల్లిదండ్రులకు గురుకుల పాఠశాలలోని సిబ్బంది నిర్లక్ష్యం ఫలితంగా తల్లిదండ్రుల కళ్ళల్లో నీరు కారుతున్నాయి. సభ్య సమాజం తలదించుకునే సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణఖేడ్ తాలూకా పరిధిలోని సిర్గాపూర్ మండలం కాజాపూర్ గ్రామానికి చెందిన ఓ మైనార్టీ విద్యార్థిని నారాయణఖేడ్లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ బైపిసి మొదటి సంవత్సరం చదువుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆమెకున్న ప్రేమ వ్యవహారంతో గర్భవతి అయింది. ఈ విషయాన్ని గుర్తించని గురుకుల పాఠశాల సిబ్బంది పాఠశాలలోనే ఆమెకు విద్య బోధన చేస్తున్నారు. ప్రతినెల హాస్టల్లో ఉన్న మెడికల్ సిబ్బంది (ఏ ఎన్ యం ) విద్యార్థులకు ప్రతినెల పరీక్షలు నిర్వహించి నెలవారీగా వారికి ఉన్న ఆరోగ్య వ్యక్తిగత సమస్యలు తెలుసుకుని అవసరమైన మందులు ఇవ్వడంతో పాటు సమీపంలోని పెద్ద ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించే బాధ్యత అక్కడున్న ఏ ఎన్ ఎమ్ పై ఉంది. కానీ ఏఎన్ఎం తో పాటు ప్రిన్సిపల్ పర్యవేక్షణ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విద్యార్థిని 9 నెలలపాటు గర్భవతి నుండి హాస్టల్లోనే చదువుతూ ఉన్న గర్భం దాల్చడం గల కారణాలను తెలుసుకోకపోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెల్పకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇదిలా ఉంటే ఈనెల 24న హాస్టల్ లో చదువుతున్న మైనర్ బాలిక సాక్షాత్తు బాత్రూంలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది ప్రిన్సిపల్ కు సమాచారం అందించి విద్యార్థినీ కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు. హాస్టల్ సిబ్బంది అప్పుడే పుట్టిన పసిపాపతో పాటు విద్యార్థిని తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లి అప్పగించారు. గీత విద్యార్థిని తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన పసిపాపను సిర్గాపూర్ లోని ముళ్లపదలో పడేసి వెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరిగిన విషయం బయటకు రాకపోవడంతో హాస్టల్ చదువుతున్న కొందరు విద్యార్థినిలు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఎం బి టి నాయకులకు ఇక్కడ జరిగిన సంఘటన సమాచారాన్ని అందించారు. దీంతో సంఘం నాయకులు మంగళవారం హాస్టల్ ను సందర్శించి సంఘటన వివరాలు తెలుసుకొని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన నుంచి తమను ఎలాగైనా కాపాడాలని పాఠశాల సిబ్బంది ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వద్దకు వెళ్లారు. తాను చూసుకుంటానులే మీకెందుకు మీ పని మీరు చేసుకోండి అంటూ హామీ ఇచ్చి పంపించారు. హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని గర్భవతి అయిన తొమ్మిది నెలల పాటు ఇలా అక్కడ పెట్టుకున్నారు… ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో ప్రిన్సిపల్ పై చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ సంఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపితే మైనర్ బాలిక ప్రసవానికి బాధ్యులు ఎవరు అనేది స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారానికి విద్యార్థిని సొంత గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.  దానివల్లనే గర్భం దాల్చిందా ?  లేక ఇదే పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయన్న దానిపై విచారణ చేయవలసి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :