- కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించిన బిజెపి నేతలు
- మానకొండూర్ లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
కరీంనగర్ జిల్లా: మంగళవారం అర్ధరాత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ని పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు మానకొండూర్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ ఆధ్వర్యంలో కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి అనంతరం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్కల ఎంపిటిసి గుర్రాల వెంకట్ రెడ్డి మరియు బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు హాజరై మాట్లాడుతూ…. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ని అర్ధరాత్రి పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్టు చేయడం తీవ్రమైన చర్య అని, ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వారిని గొంతులు నొక్కేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. బండి సంజయ్ కుమార్ కి క్షమాపణ చెప్పి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బిజెపి ఆధ్వర్యంలో మరిన్ని నిరసనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కేసీఆర్ ప్రభుత్వం లీకేజీ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు రావుల శంకరాచారి, మండల ప్రధాన కార్యదర్శి సోన్నాకుల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు శీలం కుమార్ యాదవ్,కార్యదర్శి ఆదిమూలం శ్రీనివాస్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అడప రవి, బీజేవైఎం మండల అధ్యక్షులు భాషబోయిన ప్రదీప్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మర్రి అంజి,ఉపాధ్యక్షులు కొండ్ర వరప్రసాద్,మడ్డి రాకేష్ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ఆరెళ్లి శ్రీహరి,ప్రధాన కార్యదర్శి కోండ్ర సురేష్, ఓ బి సి మండల అధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్, నాయకులు చొప్పరి అశోక్, కమటం సతీష్, అజయ్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.