కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుంచి లక్ష్మీనరసింహుడిని ఊరేగింపుగా పల్లకిలో మూల నరసింహ స్వామి ఆలయానికి తీసుకెళ్లి పురోహితులు మణిశంకర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. ప్రజాప్రతినిధులు పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. గురువారం శకటోత్సవం, శుక్రవారం రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పరంకుశం యాదగిరి, ప్రదీప్, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.