నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా, అక్రమంగా, అన్యాయంగా పోలీసులను ఉసిగొలిపి ఎందుకు అరెస్టు చేశారో తెలపకుండానే పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కెనాల్ బ్రిడ్జి పైన కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడమైనది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతి యుతంగా కార్యక్రమం చేస్తుంటే ఇక్కడ సైతం పోలీసులు అతి ఉత్సాహంతో అరెస్టు చేయడం సమంజసం కాదని. ఈ సందర్భంగా బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్ మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో లీకులు, అవినీతి – అక్రమాలు, లిక్కర్ స్వాములు తప్ప తెలంగాణా కు ఒనగూడింది ఏమీ లేదని. కెసిఆర్ కూతురు కవిత అక్రమ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం, టీఎస్పీఎస్సీ పరీక్షల నుంచి, 10వ తరగతి పరీక్షల వరకు అన్ని లీకులు చేసి విద్యార్థులను, నిరుద్యోగులను మానసికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా వారి జీవితాలతో కూడా కేసీఆర్ ఆడుకుంటున్నాడని. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం దురదృష్టకరమని. వెంటనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐటీ మంత్రి ట్విట్టర్ టిల్లు కేటీఆర్, అసమర్థ పాలన సాగిస్తున్న కేసీఆర్ కూడా రాజీనామా చేయాలని. లేనట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో గవర్నర్ కల్పించుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని బిజెపి డిమాండ్ చేస్తూ. ప్రతి విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఒక పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్ర అధ్యక్షుడు అయిన బండి సంజయ్ ను అక్రమంగా అరెస్టు చేసే అవసరం ఏమచ్చిందని. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాలను, కవిత లిక్కర్ స్కాం లో ఇరుక్కోడాన్ని, పరీక్షల లీకుల విషయంలో ప్రజలు గమనిస్తున్న విషయాన్ని పక్కదోవ పట్టించడానికై బండి సంజయ్ ను అరెస్టు చేశారా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ. వెంటనే బండి సంజయ్ ని విడుదల చేయాలని అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు క్షమాపణలు కోరాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడమైనది.
ఈ కార్యక్రమంలో బిజెపి మరియు వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.