సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు నియోజకవర్గ పరిధిలోని బిహెచ్ఎల్ బస్సు డిపో నుండి చెన్నై, తిరుపతి కి వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన ఏసీ స్లీపర్ బస్సు సర్వీసులను పఠాన్ చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తున్న టి ఎస్ ఆర్ టి సి ని ఆదరించాలని ఆయన ప్రయాణీకులకు విజ్ఞప్తి చేశారు.
