కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రం లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. శుక్రవారం ఉదయం నుంచి భక్తులు చవడి వద్ద ఉన్న రథం దగ్గరికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు, ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గన్నేరువరం ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, సతీమణి విజ్ఞాన్ కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ బూర బాను చైతన్య తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు, గన్నేరువరం ఎంపీటీసీ బొడ్డు పుష్పలత, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బొడ్డు సునీల్ సతీమణితో కలిసి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. లక్ష్మీనరసింహస్వామి రథం వెంట గన్నేరువరం ఏఎస్ఐ లక్ష్మీనారాయణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు