- కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ లో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్.
కరీంనగర్ ఎంపీగా ఎలాంటి అభివృద్ధి చేయని బండి సంజయ్ కుమార్, ప్రతి రోజు అధికార దాహంతో, ధన దాహంతో ప్రవర్తిస్తున్నారని, అధికారం కోసం ప్రజల మధ్య చిచ్చులు పెట్టడం తప్ప కరీంనగర్ ప్రజలకు చేసింది ఏమి లేదు. ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతను మరిచి 10వ తరగతి పేపర్ లీకేజీ లో ఏ వన్ ముద్దాయిగా ఉండి కరీంనగర్ ప్రజల పరువు తీసాడని బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు, ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు.