తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బి అర్ ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని సిసిసి కార్నర్ శనివారం మంచిర్యాల జిల్లా బి అర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం సింగరేణికి బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ మహాధర్నా నిర్వహించారు, మహాధర్నాకు ముఖ్యఅతిథిలుగా తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, దేవాదాయ, న్యాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ,బెల్లంపల్లి, మంచిర్యాల, అసిఫాబాద్, ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్ రావు, అత్రం సక్కు , జోగు రామన్న రాథోడ్ బాపురావు, మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాల జడ్పీ చైర్మన్లు నల్లాల భాగ్యలక్ష్మి-ఓదెలు, కోవ లక్ష్మి, మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాల పార్టీ ఇంచార్జ్ నారదాసు లక్ష్మణ్ , అదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, మంచిర్యాల జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సింగరేణి కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.