సంగారెడ్డి : ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిరుపేదల కోసం వైద్యం అందించాలని సంకల్పంతో ఉంటే ఇక్కడి డాక్టర్ల తీరు చూస్తే మరో రకంగా ఉంది. వైద్యం కోసం వచ్చిన ఒక వ్యక్తిని రూమ్ లో తలుపులేసి కొట్టిన సంఘటన నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జరిగింది. బాధ్యుడు, స్థానికులు తెలిపిన వివరాల చూసినట్లయితే .. నారాయణఖేడ్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన నాగయ్య కుమారుడు డాక్టర్ ఇశ్రాయేలు నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్నాడు. నారాయణఖేడ్ మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమీపమున ఉన్న హట్ట్యా నాయక్ తండాకు చెందిన రాథోడ్ హన్మ నాయక్ తన ఇంటిని పనులు చేస్తుండగా బలమైన రాయి పడటంతో నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లడం జైరిగింది. అంతకుముందు తన భార్య తీవ్ర జ్వరం తో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన భార్య దగ్గర ఎవరు లేరని ఆమెకు గుల్కోజులు పెడుతున్నారని, తను తొందరగా ఆస్పత్రిలో ఓపి వద్ద చిట్టి తీసుకొని కొద్ది లైన్ లో ఉండి, గంట పైనే అవుతుందని డాక్టర్ కు తెలిపారు. దీంతో డాక్టరు అక్కడ ఉన్న వాచ్ మెన్ సత్తయ్య చేతిలో ఉన్న కర్రను తీసుకొని రూమ్ లో తలుపులు వేసి ఇష్టానుసారంగా కొట్టడంతో రెండు చేతులకు బలమైన గాయాలు, కాళ్లకు దెబ్బలు తగడంతో పోలీసుల ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.