కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా రోడ్డుపై నిర్వహించే పబ్లిక్ మీటింగ్ కు ఎలాంటి పోలీసు అనుమతి లేదని తిమ్మాపూర్ సర్కిల్ సీఐ రమేష్ ఎస్ఐ సురేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఇట్టి అనుమతి లేని కార్యక్రమంలో పాల్గొన్న, ఏర్పాట్లు చేసిన వారికి చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇట్టి విషయాన్ని గమనించి ఎవరు కూడా అనుమతి లేని కార్యక్రమంలో పాల్గొనవద్దని, ఒకవేళ పాల్గొన్నట్లయితే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని తెలిపారు. గన్నేరువరం బస్టాండ్ వద్ద నిర్వహించే మీటింగ్ వల్ల ప్రజలకు, ప్రజా రవాణాకు ఇబ్బంది కలుగుతుందని అనుమతి నిరాకరించటమైనది. మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వలేదని కాంగ్రెస్ వారు అసత్య ప్రచారం చేస్తున్నారని, రోడ్డుపైన కాకుండా ఇతర ప్రైవేట్ స్థలంలో, ఫంక్షన్ హాల్ లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్లయితే అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు.