ఖమ్మం జిల్లా కారేపల్లి మం. చీమలపాడులో విషాదం జరిగింది. BRS ఆత్మీయ సమ్మేళనం కోసం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు వస్తుండటంతో కార్యకర్తలు బాణసంచా పేల్చారు. నిప్పురవ్వలు పడి పూరి గుడిసె దగ్ధమైంది. మంటల వల్ల గుడిసెలోని సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో పోలీసులు, జర్నలిస్టులు కూడా ఉన్నట్టు సమాచారం. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు . అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
