- మానవత్వం చాటుకున్న చంద్రగిరి టీడీపీ ఇన్ చార్జ్
- 24గంటల్లో మహిళకు వీల్ చైర్..అందించి
మాట నిలబెట్టుకున్న “పులివర్తి నాని”
తిరుపతి: కష్టాల్లో ఉన్న వారికి తెలుగు దేశం పార్టి ఎప్పుడూ అండగా ఉంటుంది. చేయూతనిచ్చి ఆదుకుంటుంది.ఇక టీడీపీ కోసం పనిచేసే నాయకులైతే ఆదలో ఉన్న వారికి ఆపన్న హస్తాన్ని అందిస్తారు.మానవ సేవే మాధవసేవకు ప్రతిరూపంగా నిలుస్తారు. తాజాగా తెలుగు దేశం పార్టి చంద్రగిరి ఇన్ చార్జ్ పులివర్తి నాని ఇందుకు నిదర్శనంగా నిలిచారు. మొదటి రోజు “మీ ఇంటి వద్దకు.. మీ పులివర్తి నాని” కార్యక్రమంలో భాగంగా తిరుపతి అర్బన్ మండలం, ఉమ్మడి శెట్టిపల్లి పంచాయితీ, వెంకటేశ్వర కాలనీలో నడవలేని స్థితిలో ఉన్న మునిరత్నమ్మను పులివర్తి నాని గుర్తించారు. 3 ఏళ్ల క్రితం వెన్నుపూస ఆపరేషన్ చేయించుకుని మంచానికే పరిమితమైన బాదితురాలని పరామర్శించారు. ఆమె యోగక్షేమాలు తెలుసుకుని , మునిరత్నమ్మ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.అంతేకాకుండా నడవలేని స్థితిలో ఉన్న ఆమెకు 24గంటల్లో వీల్ చైర్ అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. పులివర్తి నాని చొరవకు బాదితురాలు ఆనందం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలియజేసారు.మంచి సంకల్పంతో ముందుకు సాగుతున్న నానికి ప్రజల అండదండలు, ఆశ్శీసులుంటాయనీ కాంక్షించారు. ప్రజా సంక్షేమం కోసం పని చేసే తెలుగు దేశం పార్టీ వెంటే ప్రజానికం ఉంటుందన్నారు.