కరీంనగర్ జిల్లా: మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గన్నేరువరం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి యువజన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అలాగే సీనియర్ రాజకీయ నాయకులు, ఆయా పార్టీల నేతలు, అంబేద్కర్ అభిమానులు ,ప్రైవేటు స్వచ్ఛంద సంస్థల సభ్యులు మేధావులు, విద్యార్థులు, అందరూ కలిసి పూలమాలలు వేసి, స్వీట్ల పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం విలువలు ప్రాధాన్యతను ప్రజలందరికీ తెలియాల్సిన అవసరత ఎంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు