contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏపీ ఎస్పీడీసీఎల్ సిఎండిగా కె. సంతోష రావు

తిరుపతి:  దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గా కే సంతోష్ రావును నియమిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న కె. సంతోష రావుకు ఏపీఎస్పీడీసీఎల్ సిఎండిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు మేరకు ఆయన గత ఏడాది జులై 22న ఏపీ ఎస్పీడీసీఎల్ సిఎండిగా అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఏపీఈపీడీసీఎల్ సిఎండిగా ఐ. పృథ్వీ తేజ్ ను నియమించడంతో పాటు ఏపీ ఎస్పీడీసీఎల్ సిఎండిగా కె. సంతోష రావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా సంస్థ అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :