contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రజలకు జవాబుధారి వ్యవస్థ సచివాలయాలు : కమిషనర్ హరిత

తిరుపతి: ప్రజలకు జవాబుదారీ వ్యవస్థగా వ్యవహరించి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, ప్రజాభివృద్ధి పథకాలు వారికి అందేలా చూడడానికి సచివాలయ వ్యవస్థ వ్యవహరించాలని సచివాలయ సిబ్బందిని ఉద్దెసించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ దామలచెరువు హరిత అన్నారు. తిరుపతి నగరంలోని ఒకటవ డివిజన్లోని ఒకటి,రెండు,మూడు వార్డు సచివాలయాలను శనివారం సాయంత్రం కమీషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతూ వార్డు పరిధిలోని సమస్యలను పరిష్కరించేంత వరకు సిబ్బందిదే బాధ్యతన్నారు. శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా డివిజన్లు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. వారానికి ఒకసారన్న శానిటేషన్ వర్క్ కోసం వెళ్లే మస్టర్ పాయింట్లను కచ్చితంగా పరిశీలించాలని సూచించారు. తడి పొడి చెత్తను వేరువేరుగా అందించాలని, ప్రజలకి అవగాహన కల్పించడంతోపాటు పారిశుద్ధ్య కార్మికుల పనితీరును కూడా మెరుగుపరిచేలా సచివాలయ శానిటేషన్ సిబ్బంది పనిచేయాలన్నారు. సచివాలయల్లో పనిచేస్తున్న వాలంటీర్ల పైన నేపంవేసి పనులను అశ్రద్ధ పెట్టకూడదన్నారు. యూజర్ చార్జీలు పెంచేలా ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలని సూచనలు చేసారు హరిత. అదేవిధంగా ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది తమకు కేటాయించిన యూనిఫామ్ను కచ్చితంగా ధరించాలని, ఐడికార్డ్స్ ను ధరింప చేసుకోవాలని, ముఖ్యంగా సమయపాలన పాటించాలని కమిషనర్ హరిత ఆదేశించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :