- సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రెస్ మీట్…
సత్తెనపల్లి : మూడుసార్లు మంత్రిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా దళితుల మద్దతో గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టాలని దుర్మార్గపు ఆలోచన వైయస్సార్సీపి నాయకులు చేయడాని ఖండిస్తున్నాం, రాజ్యాంగ రచయిత ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదిన పురస్కరించుకొని నివాళులు అర్పించడానికి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ గారి మీద దాడికి దిగి ఆయన మీదనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు పెట్టాలని చూడటం దుర్మార్గమైన చర్య దీన్ని మేము ఖండిస్తున్నాం ఇటువంటి చర్యల వలన భవిష్యత్తులో దళిత నాయకుల కార్యక్రమాలకు దళితేతరులు హాజరవ్వటానికి ఎనక ముందు చూసుకునే పరిస్థితి వస్తుంది. దళితులను అడ్డం పెట్టుకొని వారి ఓట్లతో గెలిచి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ను నీరుగార్చాలని చూడటమే, నిజంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాల్సి వస్తే 27 రకాల దళిత అభివృద్ధి కార్యక్రమాలను రద్దుపరిచి ఒక్క రూపాయి కూడా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ ఫన్డును ఇతర అవసరాలకు బదలాయింపు చేసినారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద పెట్టాలి, చిత్తూరు మొదలుకొని ఇచ్చాపురం వరకు దళితుల మీద దళిత ఆడబిడ్డల మీద దాడులు చేస్తూ, మానభంగాలు చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి, దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి నాయకులు మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి, అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచి రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తున్న అధికార పార్టీ నాయకుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి ఎస్సీ నాయకులుగా ఉంటూ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ అధికార పార్టీ తొత్తులుగా మారి దళిత నాయకులమని చెప్పుకునే నాయకుల్లారా నిజమైన అంబేద్కర్ వాదులైతే అధికార పార్టీకి అమ్ముడుపోయే తత్వాన్ని మీరు మార్చుకొని కన్నా గారి మీద పెట్టిన కేసులు ఉపసపరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సిపి నాయకుల్లారా దుర్మార్గపు ఆలోచనలు పద్ధతులు వీడి టిడిపి నాయకులను టార్గెట్ చేసి కేసులు పెట్టి వేధించాలని చూస్తే రేపు ఇంతకంటే ఎక్కువ సన్మానాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నాం. కేసును ఉపసంహరించ కుంటే దీటుగా కార్యక్రమాలు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎల్ రవి, లంకా వీరయ్య, చింతపల్లి లక్ష్మయ్య, చింతపల్లి శ్రీనివాసరావు, తోడేటి బోస్, మల్లవరపు జోజి మొదలగు వారు పాల్గొన్నారు…