కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో కంటి వెలుగు కేంద్రాన్ని ఎంపీపీ లింగాల మల్లారెడ్డి ప్రారంభించారు, ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకాన్ని మండల ప్రజలు అందరూ సద్వినియొగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుడ్డు రేణుక, ఎంపిడిఓ స్వాతీ,డా,, సందీప్ రెడ్డి, దుడ్డు మల్లేశం ,కాంతాల విక్రమ్ రెడ్డి ,వార్డ్ సభ్యులు, వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.