జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో వింత ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్‌లోని ఎర్గట్లకు చెందిన రవళి అనే మహిళ ఇవాళ తెల్లవారుజామున మగబిడ్డకు జన్మనివ్వగా.. శిశువు చేతులు, కాళ్లకు మొత్తం కలిపి 24 వేళ్లు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని.. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.