తిరుపతి: తిరుపతి అభివృద్దికై తీసుకువస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులను వేగవంతం చేస్తూ.., అవసరమైన వారికి టిడిఆర్ బాండ్లను ఇచ్చే విషయంలో వేగంగా పని చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ దామలచెరువు హరిత ఐ.ఏ.ఎస్ అన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల పనితీరుపై, అదేవిధంగా టిడిఆర్ (ట్రాన్సఫరబుల్ డెవెలప్‌మెంట్ రైట్స్) బాండ్లు మాస్టర్ ప్లాన్ రోడ్లకు తమ స్థలాలు ఇస్తున్నవారికి వేగవంతంగా అందించాల్సిన భాధ్యత తమ పై వుందన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యలయంలో ప్లానింగ్ అధికారులతో కమిషనర్ హరిత ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తిరుపతి నగరం విస్తిరణకు అవసరమైన రోడ్లను నగరపాలక సంస్థ పాలకమండలి ఆమోదంతో తిరుపతి నగరంలో అవసరమైన 13 మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావడం జరిగిందన్నదన్నారు. ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అన్నమయ్య మార్గ్, వై.ఎస్.ఆర్ మార్గ్, సామవాయి మార్గ్ మాస్టర్ ప్లాన్ రోడ్లు ప్రజలకు ఉపయోగకరంగా వున్నాయన్నారు. వచ్చే నెల మొదటి వారంలో జరగనున్న తిరుపతి గంగమ్మ జాతరకు గంగమ్మగుడి వద్ద నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్డును పూర్తి చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆ మార్గంలో పెండింగులో వున్న భవనాల తొలగింపు వేగవంతం చేయాలని చెబుతూ స్థలాలిచ్చిన అర్హులైన వారి టిడిఆర్ బాండ్లను త్వరగా అందించాలన్నారు. అదేవిధంగా లీగల్ సమస్యలు వుంటె సకాలంలో పరిష్కరించేలా చూడడం చేయాలని కమిషనర్ హరిత అధికారులకు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ సునీత, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు బాలసుబ్రమణ్యం, షణ్ముగం, ప్లానింగ్ సిబ్బంది జగధీష్ రెడ్డి, ధర్మా, శారదాంబా, సాయిలీలా, శ్రీధర్, రవి తేజా, శ్రావణ్, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.