- ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆలు పెరగని పోరాటం చేస్తోంది..!!
- తెలుగు దేశం పార్టిని ప్రజలు తప్పక ఆదరిస్తారు…!!! : ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
- పులివర్తి నానికి సంఘీభావం తెలిపిన కంచర్ల..
తిరుపతి: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా.., ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ… బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తోందనీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పలు పెరగని పోరాటం చేస్తుందన్నారు. ప్రజా అభ్యున్నతి పాటుపడుతున్న టిడిపిని ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తిరుపతి అర్బన్ మండలం, ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీలో నిర్వహించిన
మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని, చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి సంఘీభావం తెలిపారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు జనంతో మమేకమవుతున్న నాని కష్టం వృధాకాదన్నారు కంచర్ల. ప్రజలు పులివర్తి నాని నాయకత్వాన్ని తప్పక బలపరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం ఆయన పులివర్తి నానితో కలసి ఇంటింటికెళ్ళి ,స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
కష్టాల్లో ఉన్న వారందరికీ టీడీపీ బాసటగా నిలుస్తుందని చెప్పిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్..,నియోజకవర్గ ప్రజానికి అనునిత్యం అందుబాటులో ఉండే పులివర్తి నానిని ఆదరించాలనీ ఆయన అభ్యర్థించారు. 2024లో చంద్రగిరి కోట పై టీడీపీ జండాను ఎగుర వేయాలని,ఇందు కోసం ప్రజలంతా ఏకమై తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన కోరారు.