- బ్రహ్మరథం పట్టిన ప్రజానీకం
కరీంనగర్ జిల్లా : రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ బుధవారం వేకువ జాము నుండి తొలిపొద్దు పర్యటనలో భాగంగా గన్నేరువరం మండలంలో విస్తృతంగా పర్యటించారు, గుండ్లపల్లి,చీమలకుంటపల్లి
గ్రామంలోకి చేరుకొని లబ్దిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు,గునుకుల కొండాపూర్ గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రాంభించారు, అనంతరం జంగపల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసి, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు,గోపాల్పూర్ గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిచారు,ఈ సందర్భంగా అభివృద్ధి ప్రధాత, బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి అయిన ఎమ్మెల్యే రసమయి కి ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, బీ.ఆర్.ఎస్.పార్టీ కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు.. ఈకార్యక్రమంలో జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి,ఎంపిటిసి ల ఫోరం అధ్యక్షులు గూడెల్లి ఆంజనేయులు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఎండి రఫీ, వివిధ గ్రామాల సర్పంచులు అట్టికం శారద, కర్ర రేఖ, నాయకులు న్యాత సుధాకర్, కర్ర కొమురయ్య, గొల్లపెల్లి రవి,చింతల రవి, (ఐకెపి) ఏపీఎం లావణ్య, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి,గ్రామ శాఖ అధ్యక్షుడు మహంకాళి ప్రభాకర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల బి.ఆర్.ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.