- జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలి
- అసెంబ్లీ సాక్షిగా మాట తప్పిన మామ, అల్లుడు
- బీఆరెస్ ప్రభుత్వ తీరుపై తెలంగాణ పీసీసీ ప్రతినిధులు చౌదరి సుప్రభాత్ రావు,మ్యాడం బాలక్రిష్ణ మండిపాటు
సంగారెడ్డి : కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతనిధులు చౌదరి సుప్రభాత రావు, మ్యాడం బాలక్రిష్ణ మండిపడ్డారు. ఈ మేరకు వారు బుధవారంనాడు విలేఖర్లతో మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ఉత్తర్వులు ఏప్రిల్ 1 నుండి అమలయ్యేలా చూస్తామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి హరీష్ రావు చేసిన ప్రకటన బుట్టదాఖలైందన్నారు. జూనియర్ పంచాయతి కార్యదర్శుల సర్వీసు రెగ్యులరైజేషన్ విషయంలో తీవ్ర తాత్సారం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు ఒక కలం పోటుతో కాంట్రాక్టు సమస్యకు పరిష్కారం చెస్తా మన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు కాంట్రాక్టు ఉద్యోగులే ఉండరని చెప్పి మోసం చేశారన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకంలో కాంట్రాక్టు లేదా ఔట్,సోర్సింగ్ విధానం అవలంబించడమే మోసపూరితమన్నారు. టి ఎస్ పీఎస్ సీ ద్వారా ఎంపికైన ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ గా గుర్తించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. జేపీఎస్ ల సర్వీసుల కొనసాగింపుపై వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ భారత్ గౌడ్, అబ్లపూర్ మాజీ సర్పంచ్ సత్యం అన్న, రామాయంపేట పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకటేష్, నవీన్ చౌదరి, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.