- జగనన్న హౌసింగ్ లబ్ధిదారుల డాక్యూమెంట్స్ తీసుకునేవారేరి
- సచివాలయం- 2 ఇంజినీరింగ్ అసిస్టెంట్ అందుబాటులో లేకపోడంతో టేబుల్ పై పెట్టివెళ్ళమన్న సచివాలయ సిబ్బంది
- లబ్ధిదారులు ఇచ్చిన డాక్యూమెంట్లకు దిక్కెవరు ఇచ్చిన డాక్యూమెంట్స్ మిస్ఐతే లబ్ధిదారుల పరిస్థితిప్రభుత్వ పధకాల పట్ల సిబ్బందికి అంత నిర్లక్ష్యమా
పల్నాడు జిల్లా కారంపూడి: వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు నీడ కలిపించాలనే ఉద్దేశంతో ఇంటి స్థలాలను పట్టాలను అందించింది. పట్టాలు తీసుకున్న లబ్ధిదారులు తప్పనిసరిగా ఇల్లు నిర్మించుకోవాలని ఇళ్లను మంజూరు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మించుకోవాలని, లబ్ధిదారుల హౌసింగ్ డాక్యూమెంట్స్ ను సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ కు అందిచాలాని అధికారులు పట్టణంలో టంకా వేయించారు. అధికారుల సూచనా మేరకు లబ్ధిదారులు తమ డాక్యుమెంట్ లను ఇవ్వడానికి సచివాలయం- 2 కు వెళ్లారు. సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ అందుబాటులో లేరు. సచివాలయంలో ఉన్న మిగతా సిబ్బంది టేబుల్ పై పెట్టి వెళ్ళమని అన్నారని లబ్ధిదారులు విమర్శిస్తున్నారు. త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని ప్రభుత్వం తొందర పెడుతుంటే సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారని లబ్ధిదారులు విమర్శిస్తున్నారు. ఎవరు లేని టేబుల్ పై డాక్యూమెంట్స్ పెడితే ఆవి మిస్ ఐతే మా పరిస్థితి ఏమిటి అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. మండల స్థాయి అధికారులు ఒకసారి సచివాలయం 2 వైపు చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.