- సకాలంలో డబ్బు చెల్లించక పోతే చర్యలు తప్పవు. ప్రైవేట్ చిట్ ఫండ్ యాజమాన్య ప్రతినిధులతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ కమిషనర్ కేంద్రంలో ప్రైవేట్ చిట్ ఫండ్ యాజమాన్య ప్రతినిధులతో గురువారం నాడు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎల్.సుబ్బరాయుడు మాట్లాడుతూ గడువు ముగిసిన మరియు అవసరమైన సమయాల్లో చిట్ గ్రూప్ లోని సభ్యులకు సకాలంలో డబ్బు చెల్లించట్లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రజలు తమ భవిష్యత్ అవసరాల కోసం చిట్ ఫండ్ సంస్థలను నమ్మి, డబ్బులు కూడపెట్టుకుంటారని అవసరానికి వారికి అందించకుండా పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కొన్ని సంస్థలు ఏకంగా డబ్బుకు బదులు తక్కువ ధర గల భూములను ఎక్కువగా చూపిస్తూ బలవంతపు రిజిస్ట్రేషన్ చేయించి గ్రూప్ సభ్యులకు కట్టబెడుతున్నారని తెలిసిందన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు కరీంనగర్ పోలీసులు బాధితుల వెంట ఉంటామని తెలిపారు.