సంగారెడ్డి: ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు.
సోమవారం జిల్లా నలు మూలల నుండి వివిధ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన ప్రజల నుండి ఆయన వినతులను స్వీకరించారు.
భూ సమస్యల పరిష్కారం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరీ, ఆసరా పెన్షన్లు, ఉపాధి కల్పనకు, దివ్యాంగుల ఉపకరణాలు, తదితరాలపై (29) దరఖాస్తులు వచ్చాయని, అందులో
రెవెన్యూ శాఖకు సంబంధించి (13) ఆర్జీలు అందగా, గ్రామీణ అభివృద్ధి సంస్థ , ఐ సి డి ఎస్,హౌసింగ్, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, తదితర శాఖలకు సంబంధించి (16) దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారి అంబదాస్ తదితరులు పాల్గొన్నారు.