కరీంనగర్ జిల్లా: అధికార పార్టీ నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ విద్యుత్ శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఓ దళిత బీద రైతుకు అన్యాయం చేశారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ కార్పొరేషన్ లోని ఎనిమిది డివిజన్ అలుగునూరుకు చెందిన సిరిసిల్ల అంజయ్య అనే రైతుకున్న కొద్దిపాటి 18 గుంటల భూమిలో నుంచి 33 కెవి విద్యుత్తు స్తంభాల లైను వేశారని, తన భూమికి 100 మీటర్ల ముందున్న అధికార పార్టీకి చెందిన నాయకుడి భూమిలో నుంచి వెళ్లాల్సిన 33 కెవి విద్యుత్తు లైను దిశను మార్చి అతని పొలంలో నుండి వెళ్లకుండా వెనక నుండి తన పొలం నుండి తీసుకెళ్లారని దీంతో తనకున్న కొద్దిపాటి భూమికి విలువ లేకుండా పోయిందని కూలి చేసుకుంటూ బ్రతికే తమకు ఉన్న కొద్ది భూమి సైతం అక్కరకు రాకుండా పోతుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు, దీనిపై విద్యుత్ శాఖ అధికారులు ఏ.ఈ, డి.ఈ,ఈఈ లకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని, జిల్లా కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేసిన పట్టించుకునే వారు లేరని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా తన భూమిలో నుంచి వేసిన 33 కెవి విద్యుత్తు లైనును తీసివేసి తనను ఆదుకోవాలని రైతు సిరిసిల్ల అంజయ్య కోరారు.
