అకాల వర్షాలకు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో అపార నష్టం వాటిల్లింది. మండలంలో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలాకు తరలించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం తడిచిపోయింది. వర్షం భీవత్సం నుండి ధాన్యాన్ని కాపాడడానికి రైతులు కష్టపడిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు వరి ధాన్యం తడిసి ముద్దయిందని.. ది రిపోర్టర్ టీవీ కథనం మేరకు అధికార యంత్రాంగం కదిలి వచ్చింది. దీంతో మంగళవారం వరి ధాన్యం కొనుగోలను ప్రారంభించారు. గన్నేరువరం కేంద్రంలో 750 క్వింటాళ్లు తూకం వేయగా వాటిని లారీ వాహనంలో రైస్ మిల్లుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
