- భారీగా తరలి వచ్చిన నియోజకవర్గ బీ.ఆర్.ఎస్. బలగం కుటుంబ సభ్యులు…
- తెలంగాణా ఉద్యమాన్ని గుర్తు చేసిన ప్రజాగాయకుడు, మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్
ఆటా పాట..
కరీంనగర్ జిల్లా: ప్రత్యేక రాష్ట్ర సాధన సాధన కోసం తన ఆటా పాటలతో తెలంగాణా ఉద్యామానికి ఊపిరి పోసి, రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రజా గాయకుడు, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ మంగళవారం తన ఆటా పాటతో ఉద్యమ కాలాన్ని గుర్తు చేశారు, తెలంగాణ ఆవిర్బావ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు బీ.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు మానకొండూర్ లో నియోజకవర్గ ప్లీనరీ సమావేశం కన్నుల పండువగా జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డా. రసమయి తో పాటు బీ.ఆర్. ఎస్. పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా ఛైర్మెన్ జీవి. రామకృష్ణారావు హాజరయ్యారు, మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో నుండి ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు బారీగా తరలి రావడంతో సభ కన్నుల పండువగా సాగింది,
తూర్పు దర్వాజా నుండి సుప్రీం ఫంక్షన్ హాల్ వరకు డప్పు చప్పుల్లు, కోలాటం నృత్యాలతో భారీ ర్యాలీ కొనసాగగా, తమ అభిమాన నాయకుడు, అభివృద్ధి ప్రధాత రసమయి పై పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు,సభా ప్రాంగాణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి, మరియు అమర వీరుల స్తూపం వద్ద ఘన నివాళులు అర్పించి గులాబీ జెండాను ఆవిష్కరించారు, అనంతరం నిర్వహించిన సమావేశంలో రసమయి తన ఆటా పాటలతో ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు, ఈ సందర్బంగా రసమయి మాట్లాడుతూ నాటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కెసిఆర్ మాట రసమయి పాటతో ముందుకు సాగి పోరాటాన్ని ఉధృతం చేశామని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పోరాటాన్ని గుర్తు చేశారు, 25 ఏళ్ల క్రితం పుట్టిన బీ.ఆర్..ఎస్ పార్టీ ఉద్యమంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా నాటి ఉద్యమ రథసారథి నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాటే తన పాటగా రూపొందించి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని పోరాటాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన వివరించారు, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను అన్ని వర్గాల అభ్యున్నతే కేసీఆర్ సంకల్పమని ఎమ్మెల్యే రసమయి కొనియాడారు, సంక్షేమ పథకాలపై బీ.ఆర్.ఎస్ ప్రభుత్వ పనితీరుపై, ఈ ప్లీనరీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ, జిల్లా అధ్యక్షులు మరియు సుడా ఛైర్మెన్ జీవి.రామకృష్ణారావు ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను హాజరైన ప్రతి ఒక్కరూ ఏకీభవించి తీర్మానం చేశారు, ఈకార్యక్రమంలో నియోజవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,యువకులు, మహిళలు పాల్గొన్నారు.