- రోడ్డున పడ్డ వీవోఏలు – పట్టించికొని తెరాస ప్రభుత్వం .
- ధనిక రాష్ట్రంలో – బ్రతుకు పోరాటం పై సమ్మె
- వీవోఏల సమ్మె పై ముఖ్యమంత్రి స్పందించాలి.
- దుంపల రంజిత్ కుమార్ ఐకేపీ వీవోఏ జిల్లా గౌరవ అధ్యక్షులు
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్: తెలంగాణ ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం (CITU) జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షులు కుంటాల కుమార్ అధ్యక్షతన శ్రీరాంపూర్ సీఐటీయు కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశంలో దుంపల రంజిత్ కుమార్ సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా బ్రతుకులు బాగుపడుతాయి. అని అనుకుంటే గ్రేడింగ్ విధానంతో పని భారం మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తుంది.ఈ రోజు గ్రామాల్లో పని చేసే వీవోఏలు అందరు నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కుటుంబలకు చెందిన వారే ఉన్నారు.అందులో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారిని ఆర్థికంగా, సామజికంగా అభివృద్ధికి తొడ్పాడే వీవోఏల పట్ల ప్రభుత్వ విధానాలు విడనడాలి.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి , కనీస వేతనం 26వేలు చెల్లించాలని, అర్హులైన వీవోఏలను సీసీ లుగా ప్రమోట్ చేయాలని తదితర సమస్యలు పరిష్కరించే విదంగా,ప్రభుత్వం సమ్మె విరామింప చేయాలని లేని యెడల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం ఈ పోరాటం ద్వారా చెప్తామని డిమాండ్ చేస్తున్నాం.
అనంతరం జిల్లా నూతన కమిటీని 23మందితో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.దుంపల రంజిత్ కుమార్ ఐకేపీ వీవోఏ జిల్లా గౌరవ అధ్యక్షులు, లింగంపల్లి వెంకటేష్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, కుంటాల కుమార్ జిల్లా అధ్యక్షులు, దుర్గం రాములు జిల్లా కార్యదర్శి, పొట్ట పోషం జిల్లా కోశాధికారి,
జిల్లా ఉపాధ్యక్షులు
రమాదేవి (కోటపల్లి),జి. రజిత – (కాసిపేట్), బుట్ల అనిత – (లక్షేట్టిపేట్), జిల్లా సహాయ కార్యదర్శులు పి. మహేష్ (బెల్లంపల్లి),రజిత (తాండూర్) సురేష్(కోటపల్లి), జిల్లా సలహా దారులు జుమ్మిడి లక్ష్మణ్ (కన్నెపల్లి),తుకారాం (మందమర్రి),
దాసు (కన్నెపల్లి),
జిల్లా కమిటీ సభ్యులు
జి. వెంకటేష్ (వేమనపల్లి),టీ. సమ్మన్న (నేన్నెల), భాగ్యలక్ష్మి (భీమారం)
గౌరీ (చెన్నూరు)
స్వరూపరాణి (కాసిపేట్)
లష్మినారాయణ (భీమిని),
దండేపల్లి- కో -ఆప్షన్,
హజిపూర్ – కో -ఆప్షన్,
జన్నారం- కో -ఆప్షన్
తదితరులు పాల్గొన్నారు.