- బిఆర్ఎస్ పార్టీలో చేరిన బిజెపి కార్యకర్తలు
- బిఆర్ఎస్ తోనే బంగారు భవిష్యత్తు
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
సంగారెడ్డి – జిన్నారం : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరుతున్నారని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
జిన్నారం మండల పరిధిలోని అండూర్ గ్రామానికి చెందిన 30 మంది బీజేపీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. సబ్బండవర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దడంతోపాటు, ప్రతి వ్యక్తి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. పార్టీలో చేరిన యువకులందరూ పార్టీ పటిష్టతకు కృషి చేయడంతో పాటు, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రతిపక్షాలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు.