సంగారెడ్డి పఠాన్ చేరు : గత 5 రోజులుగా తమను రెగ్యులరైజ్ చేయాలని దీక్ష చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రేటరీలు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీ మేరకు 4 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ పూర్తైనా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడం లేదని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారిని రెగ్యులరైజ్ చేయాలని వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి.జె.పి సీనియర్ నాయకులు బాబురాజ్ గౌడ్ పంచాయతీ కార్యదర్శులు నవోద్ రెడ్డి రామకృష్ణ నీలిమ భవాని మౌనిక రెడ్డి, సిద్దమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది