నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కుద్వాన్ పూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ , మేనేజింగ్ డైరెక్టర్ వి సి సజ్జనర్ నూతనంగా ప్రవేశపెట్టిన ప్రజల వద్దకే ఆర్టీసీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ డిపో మేనేజర్ కే కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రజల చేంతకే ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తుందని వారు తెలిపారు, అలాగే ,స్కూల్ మరియు కాలేజీ పిల్లలకు బస్ పాస్ రాయితీలు కల్పిస్తుంది దివ్యాంగులకు 50% ,20 రోజుల చార్జీలు చెల్లించి 30 రోజులు ప్రయాణించే విధంగా బస్ పాస్ అందుబాటులో ఉంటుందని అన్నారు , అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం బస్సులో ప్రయాణించి ప్రయాణికులకు మరియు దేవస్థానం దర్శనం టోకెన్స్ అందుబాటులోకి వచ్చింది అంతేకాకుండా 24 గంటల్లోపు కార్గో సేవలను అందించేలా ప్రారంభించామని తెలిపారు, ప్రజలు అందరూ ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలని కోరారు ,వివాహ మరియు శుభకార్యాలకు ఎటువంటి డిపాజిట్ లేకుండా 10/, శాతం డిస్కౌంట్ కల్పిస్తుందని తెలిపారు, అదేవిధంగా తార్నాక హాస్పిటల్ లో తక్కువ చార్జీలతో వైద్య సౌకర్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు కావున ప్రజలందరూ ఇట్టి సౌకర్యాలను సద్వినియోగపరుచుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణికులుకేవలం ఆర్టీసీ బస్సులోని ప్రయాణించాలని ఆర్మూర్ డిపో మేనేజర్ కె కవిత కోరారు.
గ్రామ సర్పంచ్ చిన్న సాయన్న , గ్రామ ఉప సర్పంచ్ సాగర్,ఎంపీటీసీ గోదావరి ప్రవీణ్ గౌడ్ విడిసి క్యాషియర్ జహీరుద్దీన్ కపూర్, వి డి సి మెంబర్స్ నారాయణ, చెల్లయ్య ,కళ్యాణ్, రంజిత్, పోశెట్టి ,ఆర్మూర్ డిపో మేనేజర్ కే కవిత, సభ్యులు నవీన్, మహేష్ ,నారాయణ, దామోదర్ ,లింగన్న , నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.