- అధికారులు పర్యవేక్షణ లోపంతో ఇలా జరుగుతుంది
అల్లూరి జిల్లా హుకుంపేట: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ప్రతిష్టాత్మకంగా ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రవేశపెట్టింది.రెవిన్యూ జిసిసి సివిల్ సప్లై అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగానే రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది. మారుమూల గ్రామంలో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు కావటం లేదు. పక్క మాస్ ప్లానింగ్ తో రేషన్ బియ్యం కోటను పక్కదార పట్టిస్తున్న డీలర్లు. మండలంలోని పట్టం పంచాయతీ డిఆర్ డిపోలో ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇంకా పలు గ్రామాల్లో అనేకమంది బాధితులు ఉన్నట్లు సమాచారం ఉంది.మార్చి నెల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉండగా కొద్దిమంది ప్రజలకు పంపిణీ చేసి చేతులు దులుపుకున్న డీలర్లు. మార్చి నెలలో బియ్యం ఇవ్వకుండానే ఏప్రిల్ నెలలో బియ్యాన్ని పంపిణీ చేశారు. దీంతో డీలర్లకు లబ్ధిదారులు మార్చి నెలకు బియ్యం ఎందుకు సప్లై కాలేదని డీలర్ వద్దకే కార్డుదారులు ప్రశ్నించారు. సప్లై రాలేదని వచ్చి నేల వస్తుందని ఇస్తానని దాటి వేసే సమాధానం చెప్పారు. దీంతో బాధితులు ఉన్నత అధికారులను సంప్రదించారు. బురువలస, గంగూడి తదితర గ్రామ ప్రజలు చాలా మంది బాధితులు ఉన్నపటికీ 14 మంది కార్డుదారులకు సుమారు 350 కేజీల వరకు రేషన్ బియ్యం పంపిణీ చేయకుండా కోత విధించారు.దీంతో గిరిజనలు మండిపడ్డారు. రేషన్ బియ్యం సప్లై కానీ పలు గ్రామాల గిరిజనులు ఇంకా ఉన్నారు. మార్చి నెలలో బియ్యం పంపిణీ చేసినట్లుగా పే స్లిప్పు కార్డులో రాయడంతో పెద్ద దుమారం లేపింది. రేషన్ బియ్యం ఇవ్వకుండా ఇచ్చినట్లు ఫోర్జర్ చేసి రాయడం తప్పైనప్పటికీ రేషన్ డీలర్లకు అలవాటుగా మారింది. దీనికి ప్రధాన కారణం జిసిసి సివిల్ సప్లై,రెవిన్యూ ఉన్నత అధికారులు
నెల నెల కు డిపోలకు పర్యవేక్షణ లోపం కారణంగా రేషన్ సరుకలు పక్కదారి పడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం నిరుపేద కుటుంబానికి చెందిన గిరిజనులకు పూర్తి స్థాయిలో అందటం లేదు. పట్టం పంచాయతీ ఇలా జరగడం దీంతో రెండోసారి గతంలో కూడా 50 మందికి సుమారు 1500 కేజీల రేషన్ బియ్యం కోత విధించడంతో గ్రామ ప్రజలు.గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉన్నత అధికారులు నిలదీయడంతో రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ జరిగింది. ఇలా రేషన్ బియ్యం పక్కదారి పట్టడం పట్టాం డిఆర్ డిపోలో దీంతో రెండోసారి జరిగింది. మండలంలో రెవెన్యూ అధికారులు కూడా డిపోల వద్ద సోదాలు తనిఖీలు నిర్వహించకపోవడంతో డీలర్లదే పైచిలుకుగా మారింది. దీంతో రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వకుండా కోత విధించి మైదాన ప్రాంతాల్లో రైస్ మిల్లు లకు ఫ్యాక్టరీలకు తరలించి రేషన్ బియ్యాన్ని సైనింగ్ చేసి అధిక ధరలకు అమకలు జరుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు దృష్టి సారించి రేషన్ బియ్యాన్ని అందని లబ్ధిదారుల కుపంపిణీ చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. నిరుపేద గిరిజనులకు ప్రభుత్వాలు సప్లై చేస్తున్న రేషన్ బియ్యం కోత విధించడం సరికాదని గిరిజన సంఘం కార్యదర్శి తాపుల కృష్ణారావు అన్నారు. ప్రతినెల గిరిజనులకు అందవలసిన నిత్యవసర సరుకులు అందకపోవడం సరికాదని ఆయన మండిపడ్డారు. అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగానే రేషన్ సరుకులు పక్కదారి పడుతుందని ఆయన ఆరోపించారు. జిల్లా కేంద్రంలో ఇలాంటి అక్రమాలు జరగడం విడ్డూరం ఉందన్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించి రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తున్న రేషన్ డీలర్లపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.