అల్లూరి జిల్లా,పాడేరు: మాతృ మరణాల నివారణకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన కార్యాలయం నుండి వైద్యాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వారీగా ఎంత మంది గర్భవతులు, బాలింతల ఆరోగ్యంపై పర్యవేక్షిస్తున్నారో డేటా సమర్పించాలని ఆదేశించారు. అంగన్వాడీ సేవలు, ప్రోత్సాహాకాలు పొందడానికి ఆర్ సి హెచ్ ఐ. డి తప్పని సరిగా ఉండాలన్నారు. జిల్లాలో 1800 మంది గర్భవతులకు ఆర్ సి హెచ్ ఐ డి బ్యాంకు ఖాతాలు లేవని వారందరికి ఆర్ సి హెచ్ ఐ.డి కల్పించాలని, బ్యాంకు ఖాతాల ప్రారంభించాలని స్పష్టం చేసారు. సబ్ సెంటర్ల వారీగా డేటా ఆర్ సి హెచ్ పోర్టల్లో నమోదు చేయాలని, 104 సేవల్లో డేటా ఎంట్రీ చేయాలని చెప్పారు. హైరిస్క్ కేసులపై ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిం చాలన్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ బి.పి, షుగర్ వ్యాధి గ్రస్తులను గుర్తించి మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు. గిరిజనుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా సేవలందించాలని అన్నారు. వైద్య సేవలందించడంలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.. గోమంది వైద్యాధికారి విజ్ఞప్తి మేరకు ఇద్దరు ఆరోగ్య సహాయకులను డిప్యూట్ చేయాలని డి ఎం అండ్ హెచ్ ఓను ఆదేశించారు..
ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. సి. జమాల్ బాషా, జిల్లా క్షయ నివారాణాధికారి టి.వి.శ్వేశ్వర నాయుడు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.