కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని వివిధ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సందర్శించారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు తరలించాలని అకాల వర్షంతో ఇప్పటికే రైతులకు అపార నష్టం వాటిల్లాందని వారు ఆవేదన వ్యక్తం చేశారు, ఇంకా పంట కోసే వాళ్లు చాలామంది ఉన్నారని వారిని వ్యవసాయ శాఖ గుర్తించి వారికి నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలని వారు డిమాండ్ చేశారు, తాలు పేరుతో మిల్లర్లు భారీగా కోతలు పెడుతున్నారని తద్వారా రైతులు ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంటకు సరైన ధర ఇవ్వకపోవడం దుర్మార్గమని అన్నారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే త్వరగా ధాన్యాన్ని మిల్లర్లకు తరలించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు, అధికారులు ధాన్యాన్ని తరలించడం లో విఫలం అయ్యారని వాపోయారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కాంతల అంజిరెడ్డి, సహకార కార్యదర్శి చొక్కల శ్రీశైలం, మండల నాయకులు కూన మల్లయ్య వీరయ్య, బోయిని మల్లయ్య పబ్బతి సాగర్ రెడ్డి, తాటికొండ నరసయ్య, తాటికొండ రాజు, గారిగే మల్లయ్య, బోయిని అంజయ్య, బుర్ర కానుకయ్య, జాలి గోపయ్య తదితరులు పాల్గొన్నారు.
