- ఘన నివాళులు అర్పించిన బీ ఆర్ ఏస్ పార్టీ బీసీ సెల్ జిల్లా నాయకులు పిడిశెట్టి రాజు
కరీంనగర్ జిల్లా: హుస్నాబాద్ నియోజకవర్గం,చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామ పంచాయతీ తెలంగాణ చౌరస్తాలో విశ్వకవి రవీంద్ర నాథ్ ఠాగూర్163వ, జయంతి వేడుకలు బారత రాష్ట్ర సమితి బీసీ సెల్ జిల్లా నాయకులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా…వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి ,రవీంద్ర నాథ్ టాగూర్ ఆయన రచించిన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతి ని అందుకున్నాడు. నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి ఆసియా వాసిగా రికార్డు కి ఎక్కారని రాజు తెలియజేశారు. ఈకార్యక్రమంలో బారత రాష్ట్ర సమితి నాయకులు వడ్డేపల్లి ఆనంద్, కన్నోజు రాహుల్ గాంధీ, చెల్పూర్ రమేష్, దామెర అనీల్ కుమార్, మారేళ్ల సదయ్య,రాజు మహేష్ తదితరులు పాల్గొన్నారు.