మానవ సమాజం ఆధునిక హంగులతో ఉరకలు వేస్తున్నవేళ అంతరించిపోతున్న ఆదివాసీ, సంస్కృతులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.సాంకేతిక పరిజ్ఞానంపై విరివిగా ఆధారపడిన ప్రస్తుత తరుణంలో అల్లూరిసీతారామరాజు జిల్లా తూర్పు మన్యంలోని ఆదివాసీ గిరిజనులు ఇప్పటికీ సహజవనరులైన భూమి, నీరు, అడవులపై, సాంప్రదాయ వ్యవసాయం, ఫలసాయం తదితరాలపై ఆధారపడి ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు. చెట్టు, పుట్ట, నీరు వంటి వాటిని పూజిస్తూ వాటితో ఒక అవినాభావ సంబంధం ఏర్పరచుకొని కొండదేవతలకు ఆనవాయితీగా పండుగలు చేస్తూ వస్తున్నారు ఈ ప్రాంత ఆదివాసీ గిరిజనులు.
తూర్పు మన్యం అంటేనే ప్రకృతి అని చెప్పాలి.అంతలా తమ ప్రకృతి అందాలను పెనవేసుకున్న ప్రాంతం ఇది.ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసి గిరిజనులు ప్రకృతిని ఆరాధ్య దైవంగా కొలుస్తూ తమ ఆచారాలను, సాంప్రదాయలను కాపడుకుంటున్నారు.అలాంటి గిరిజన ఆచార సాంప్రదయాలపై ది రిపోర్టర్స్ టీవీ అందించే ప్రత్యేక కథనం..
తూర్పు మన్యం మారేడుమిల్లి మండలం లోని గిరిజనులు ప్రకృతి తో మమేకమై నిత్యం ప్రకృతి తోనే తమ జీవనం సాగిస్తారు.వారు పండించే పంటలను సైతం ప్రకృతి కొండ దేవతలకు నైవేధ్యంగా సమర్పించిన తర్వాతనే వారు తింటారు .ఈ మన్యం లో ఉండే ఆదివాసీ గిరిజన గ్రామాల్లో వారి ఆచారాలు, సాంప్రదాయాలు వారి ఉనికికి అద్దం పడుతున్నాయి. జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు ప్రకృతి చెంత పండుగలను జరుపుకుంటూ వస్తారు.ఈ నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చి మాసంలో కూడా పిండి అనే పండుగను జరుపుకుంటారు.వారు పండించే పంట చేతికొచ్చాక ఆ పంట పేరుతో పండుగ చేసుకుంటారు.ఈ పండుగల్లో ఆదివాసీ గిరిజనులు, వనంలో ప్రకృతి దేవతకు గుడి ని కట్టి అందులో దేవతకు నాటు కోడి లేక పందిని లేక మేకను కోసి నైవేధ్యంగా ఇచ్చి వారు పండించిన పంటలను , పప్పు ధాన్యాలను దేవతకు సమర్పించి పూజలు చేస్తారు.వారి ఆచారాల్లో ఆనవాయితీగా కొరడాలతో కొట్టించుకొని కొండ దేవతకు మ్రొక్కుబడులను చెల్లిస్తారు.వనం లో అందరూ కలిసి జట్టు కట్టి రేలా పాటలతో నృత్యాలు చేస్తూ డోలులను వాయిస్తూ ఊరువాడంతా సందడి చేస్తారు.
మారేడుమిల్లి మండలం వేటుకూరు గ్రామం లో ఆదివాసీ గిరిజనులు కొండ ప్రాంతంలో పండించే రాగులు చేతికొచ్చాక పిండి పండుగ జరుపుకుంటారు.ఆ పిండి పండుగ చేసుకొన్నా తర్వాతనే అంబలి ,మొదలగు వంటకాలను తింటారు.
మన్యం మారేడుమిల్లి ప్రాంతం లో ఆదివాసీ గిరిజనులు వారి ఆచార వ్యవహార శైలి అందరికి మాదిరి ని చూపిస్తూ తమ సాంప్రదాయలను పరిచయం చేస్తు తమ ఉనికిని కాపాడుకుంటున్నారు.ఈ మన్యం లోని గిరిజనులు అనాధికాలం నుండి ప్రకృతి ఆరాధ్య దైవంగా కొలుస్తూ ప్రకృతి ప్రసాధిత ఫలాలను భుజిస్తూ కొండ దేవతలకు నిత్యం పూజలతో ఉపవాసలతో నైవేద్యాలను సమర్పిస్తూ తమ జీవనాన్ని కాపాడుకుంటూ తమ ఆచారాలను సంప్రదాయ సంస్కృతులను ఆచరిస్తూ వస్తున్నారు.