- ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం
- సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి
సిద్దిపేట జిల్లా: బెజ్జంకి మండలంలోని రేగులపల్లి స్టేజ్, బెజ్జంకి ఎక్స్ రోడ్, గాగిల్లాపూర్ ఎక్స్ రోడ్ వద్ద సీసీ కెమెరాలు ఎస్సై ఎమ్. ప్రవీణ్ రాజ్ ప్రారంభించారు, అనంతరం ఎస్సై ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలకు అడ్డుకట్ట పడుతుందని, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, ఇతర నేరాలను అదుపు చేయటంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగ పడతాయని, వాహన దారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని,నేరస్తులను పట్టుకోవటం లో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని, ఈ రోజు రేగులపల్లి స్టేజ్, బెజ్జంకి ఎక్స్ రోడ్,గాగిల్లాపూర్ స్టేజ్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం జరిగిందని, రేపు తోటపల్లి, దేవక్కపల్లి స్టేజ్ ల వద్ద ఏర్పాటు చేయటం జరుగుతుందని, సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు,యువత స్వచ్చంధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు,
గాగిల్లాపూర్ సర్పంచ్ అన్నాడి సత్యనారాయణ రెడ్డి, బెజ్జంకి ఎక్స్ రోడ్ సర్పంచ్ టేకు తిరుపతి, బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్, మాజీ ఏఎంసి డైరక్టర్ మేకల శ్రీకాంత్ యాదవ్, టెక్నీషియన్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు