- నెల రోజుల క్రితం తప్పిపోయిన వృద్ధురాలు
- ఇంటికి తీసుకువస్తున్న కుటుంబసభ్యులు
కరీంనగర్ జిల్లా : హుజూరాబాద్ వీణవంక : నెల రోజుల క్రితం తప్పిపోయిన ఓ వృద్ధురాలు గుజరాత్లో ప్రత్యక్షమైంది. పోలీసుల సహాయంతో ఆమె స్వగ్రామానికి వస్తోంది. వివరాల్లోకి వెళ్తే… వీణవంక మండ లంలోని దేశాయిపల్లికి చెందిన ముసిపట్ల పుష్పలత(60)కి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఆమె భర్త చనిపోగా ఏడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతిచెందాడు. అప్పటినుంచి మతిస్థిమితం కోల్పోయిన పుష్పలత ఎల్బాక ప్రణమ ఆశ్రమం లో ఉంటోంది. నెల రోజుల క్రితం పింఛన్ డబ్బుల కోసం స్వగ్రామం వెళ్లింది. డబ్బులు తీసుకొని, కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. మూడు రోజుల క్రితం గుజరాత్లోని కాచ్ ప్రాంతంలో పుష్ప అతను అక్కడి పోలీసులు గుర్తించారు. ఆమెను అక్కడే సఖి సెంటర్ లో ఉంచి, వీణవంక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై వారు ఎంపీపీ ముసిపట్ల రేణుకకు సంప్రదించగా ఆమె పుష్పలత కుటుంబస భ్యులకు చెప్పి, గుజరాత్ పంపించారు. చొక్కారావుపల్లివాసి సాయంతో… గుజరాత్లో పుష్పలత గన్నేరువరం మండలంలోని చొక్కారావుపల్లికి చెందిన అనిల్ రెడ్డి గతంలో గుజరాత్లోని వడోదరలో చదివాడు. ఆ సమయంలో కుచ్ బుజ్ ప్రాంతానికి చెందిన భార్గవ్ తో స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో అనిల్ రెడ్డీ ఐదు రోజుల క్రితం ఎల్బాకలోని ప్రణమ ఆశ్రమానికి వెళ్లగా వృద్ధురాలి విషయం తెలిసింది. వెంటనే అతను భార్గవ్తో ఫోన్లో మాట్లాడి, ఆమెను ఇంటికి పంపించాలని కోరాడు. దీంతో భార్గవ్ అక్కడి పోలీసులు, సఖి సెంటర్ నిర్వాహకులతో మాట్లాడి, బాధితురాలి తోపాటు ఆమె కుటుంబసభ్యులను రైలు ఎక్కించాడు. వారు. బుధవారం ఇంటికి చేరుకోనున్నారని గ్రామస్తులు తెలిపారు.