కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం : ఈనెల 15 నుంచి 17 వరకు మండల స్థాయి సీఎం కప్పు టోర్నమెంట్ ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు ఎంపీపీ లింగాల మల్లారెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సీఎం కప్పు టోర్నమెంట్ మండల స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు బుధవారం ఎంపీపీ లింగాల మల్లారెడ్డి ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. మండల స్థాయి ఆటల పోటీలు ఈనెల 15 నుంచి 17 వరకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ పోటీలు 18 నుంచి 36 సంవత్సరాల వయసుగల మహిళలకు, పురుషులకు వివిధ విభాగాలలో నిర్వహించబడునని చెప్పారు. మండల స్థాయిలో పుట్ బాల్, కబడ్డీ, వాలీబాల్,ఖోఖో మరియు అథ్లెటిక్స్ (100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెం)లాంగ్ జంప్, షాట్ పుట్ వంటి ఆటల పోటీలు నిర్వహించబడునని తెలిపారు. కావున మండలంలోని ప్రతి గ్రామం నుండి 1టీమ్ తప్పనిసరిగా పైన పేర్కొన్న ఆటలలో పాల్గొనాలని సూచించారు ఈకార్యక్రమంలో ఎంపీడీవో స్వాతి, ఎస్ఐ మామిడాల సురేందర్, ఎమ్మార్వో అనంతరెడ్డి, ఎంపిఓ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు