కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1993 – 94 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. మొదట తాడికల్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఒకరికొకరు ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం మొలంగూర్ లక్ష్మీప్రసన్న గార్డెన్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో గురువులు తాటిపల్లి రామయ్య, కాసు ఐలయ్య, శ్యాంసుందర్ , లను పూలమాల శాలువా మెమొంటో తో సత్కరించారు. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ చిన్ననాటి స్నేహ బంధాలే గొప్పవని అప్పటి జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని విద్య వినయం తో పాటు ప్రతి ఒక్కరిలో క్రమశిక్షణ అవసరమన్నారు, అప్పుడే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను పూర్వ విద్యార్థులతో పంచుకున్నారు.