భద్రాది: మావోయిస్టు పారీ ఆగ్రనాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం క్రింది స్థాయి నాయకులు, సభ్యులను బలి చేస్తున్నారని డా.వినీత్.జి ఐపిఎస్ అన్నారు.నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకులు తమ కుటుంబాల కోసం. స్వార్ధ ప్రయోజనాల కోసం. విలాసవంతమైన జీవితాలను గడపడం కోసం అమాయకులైన క్రింది స్థాయి నాయకులను, దళ సభ్యులను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాడుకుంటున్నారని ఈ రోజు ఎస్పీ డా.వినీత్.జి.ఐపీఎస్ ఒక ప్రకటనలో వెల్లడించారు. సరిహద్దు ఏజెన్సీ గ్రామాల్లో నివసిస్తున్న అమాయకపు ఆదివాసి యువతీ,యువకులను బలవంతంగా పార్టీలోకి చేర్చుకొని వారి చేతికి తుపాకులు, పేలుడు సామాగ్రి ఇచ్చి పోలీసులపై దాడి చేయడానికి పంపుతూ వారికి జీవితాలే లేకుండా చేస్తున్నారు. కాంట్రాక్టర్లు, రైతులు, నాయకులను బెదిరిస్తూ అమాయకులైన క్తింది స్థాయి కేడర్ తో డబ్బులు వసూలు చేయిస్తున్నారు. సరిహద్దు ఏజెన్సీ గ్రామాల్లోని యువతను చదువుకోనీయకుండా, వ్యవసాయం చేయనీకుండా బలవంతంగా వారి చేతికి తుపాకులను ఇచ్చి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు తమ స్వార్టప్రయోజనాల కోసం పన్నిన కుట్రను గ్రహించన కింది స్థాయి అమాయక దళనాయకులు, సబ్యులు ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారు. అమాయకులైన రైతులను చంపడం, ఆదీవాసీలు సంచరించే ప్రదేశాల్లో బాంబులు పెట్టి మూగజీవాలను బలితీసుకోవడం కాంట్రాక్టర్లను బిదిరించడం, ఇన్సార్మర్ల నెపంతో తమ ఆదీవాసిలనే చంపడం, కర్తవ్యంలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై దాడులు చేయడం లాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే ఇటివల దంతేవాడలో DRG పోలీసులపై దాడికి పాల్పడి అమాయకులైన 13 మంది ఆదివాసిల ప్రాణాలను బలిగొన్నారు. ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ది చెందితే తమకు మనుగడ ఉండదని అమాయకులైన ఆదివాసీలకు మాయ మాటలు చెప్పి మావోయిస్ట్ పార్టీ నాయకులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. మైనర్లుగా అమాయకత్వంతో ఉన్నప్పుడు సోడి జోగయ్య, రాజేష్ సోడి మాడ, మడకం ఎర్ర, పోడియం బీమే లాంటి వారిని పార్టీలోకి చేర్చుకుని వారి చేతికి తుపాకులు ఇచ్చి మావోయిస్టులుగా తయారుచేసి పోలీసులపై దాడి చేయడానికి ఉసిగొలిపి వారు మరణించడానికి మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులే కారణమయ్యారు. ఎదురు కాల్పుల్లో ప్రాణాలను కోల్పోయిన వారి మరణాలకు మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులే బాధ్యత వహించాలి. దామోదర్, ఆజాద్, అరుణ మరియు ఇతర అఆగ్రనాయకులు అక్రమంగా సంపాదించిన రక్తపు మరకలంటిన డబ్బును వివిధ ప్రాంతాల్లో ఉన్న వారి కుటుంబాలకు పంపుతూ ఆదివాసీల కుటుంబాలను మాత్రం అన్యాయం చేస్తున్నారు. సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల నుండి మైనర్ బాలబాలికలను బలవంతంగా పార్టీలోకి చేర్చుకొని వారిని వ్యక్తిగత పనులకు వాడుకుంటున్నారు. నిపేధిత మావోయిస్టు పార్టీ ఆగ్రనాయకుల కుట్ర తెలియక మరణించిన కింది స్థాయి కేడర్ కుటుంబాలకు అగ్రనాయకులే సమాదానం చెప్పాలి. ఇప్పటికైనా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల కుట్రను గమనించి క్రింది స్థాయి నాయకులు, ధళ సభ్యులు లొంగిపోయి తమ కుటుంబాలతో కలినీ జీవించడానికి జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుండి అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందేలా జిల్లా పోలీసు శాఖ కృషి చేస్తుంది.