- ఎమ్మెల్యేలు, ఎంపి ఆదివాసులకు వెన్నుపోటు పొడిచారు
- కేంద్ర ప్రభుత్వ అటవీ సంరక్షణ చట్టం సవరణ పై రాష్ట్ర అధికార,ప్రతి పక్ష పార్టీకి స్పందించాలి.
- హైడ్రో పవర్ ప్రాజెక్ట్, మైనింగ్ లీజు రద్దు చేయవలసిందే.
- ఉద్రేకంగా మారిన ఛలో కలెక్టరేట్
- కలెక్టరేట్ లోపల చొచ్చుకు పోయిన గిరిజనులు
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం: ఆదివాసులకు వెన్నుపోటు పొడిచి, ద్రోహానికి తలపెట్టిన ఎమ్మెల్యేలు ఎంపీ ను గ్రామాల్లో పర్యటనలు నిలదీయాలని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి అప్పల నర్శ అన్నారు.
పాడేరు గిరిజన సంఘం ఆధ్వర్యంలో లో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు గిరిజన సంఘం జిల్లా కార్యాలయం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించడానికి నాయకులకు అనుమతించకపోవడంతో ఉద్రేకతగా మారింది. నాయకులనే కాదు గిరిజన అందరిని జిల్లా కలెక్టర్ కార్యాలయం లోపల అనుమతించాలని పోలీసులతో ఘర్షణ పడ్డారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా మొహరించి ఆందోళనకారులను కలెక్టరేట్ లోపలికి అనుమతించకుండా నిరోధించే ప్రయత్నం చేసినప్పటికీ చివరికి గేట్ను తోసుకుంటూ చొచ్చుకుపోయారు. జిల్లా జెసి ఆందోళనకారులందరినీ కలెక్టరేట్ కార్యాలయం లోపల అనుమతించారు.
జెసి కి గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వినతి పత్రాన్ని నాయకులు సమర్పించారు. జెసి మాట్లాడుతూ… బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించే ప్రతిపాదన పై అసెంబ్లీ తీర్మానం రద్దు చేయాలని గిరిజనుల అభిప్రాయంగా ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న రివ్యూ పెట్టేసిన పై స్టేటస్ ని తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు హైదరాబాద్ ప్రాజెక్ట్ పై సమగ్రమైన సమాచారాన్ని తెప్పించుకునే విశ్లేషించి గిరిజనుల అభిప్రాయాన్ని అనుగుణంగా నడుచుకుంటామని తెలియజేశారు నిమ్మలపాడు మైనింగ్ పై గ్రామ సభ అభిప్రాయాన్ని ముక్తకంఠంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి లీజురతుకు ప్రయత్నం చేస్తామని జెసి గారు వివరించారు. అటవీ హక్కుల చట్టం అమలుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాఖ అధికారులతో సంప్రదించి వీలైన త్వరగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం గేటు బయట నిర్వహించిన ధర్నాలు గ్రీటింగ్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర అధ్యక్షత నిర్వహించగా గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనర్శ మాట్లాడుతూ….. బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించే అసెంబ్లీ తీర్మానం రద్దు చేయాలని తీర్మానం ప్రవేశ పెట్టడానికి ముందు బోయ వాల్మీకులపై వేకసభ్య కమిషన్ ఏనాడు గిరిజన గ్రామాలు తిరుగలేదని ఎటువంటి సమగ్రమైన అధ్యయనం లేకుండా అర్హత లేని వారిని ఎస్టీ జాబితాలో చేర్పించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించే వరకు ఉద్యమం ఆగదని అన్నారు,ఆదివాసులకు గిరిజన ప్రజాప్రతినిధులు వెన్నుపోటు పొడిచి ద్రోహం చేస్తున్నారని గిరిజన ద్రోహులు గ్రామాల్లో పర్యటనకు వచ్చినప్పుడు నిలదీయాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 3 రిజర్వేషన్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ రూపంలో పెండింగ్ ఉండగా అల్లూరు జిల్లా పరిధిలో రంపచోడవరం ఐటీడీఏ లో రూలర్ రిజర్వేషన్ ప్రకారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పి ఐటీడీఏ పిఓ నోటీసు జారీ చేయడం సరైన చర్య కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పై ఫైనల్ కాకుండా ప్రభుత్వ అధికారులు గిరిజనులకు ద్రోహం చేస్తూ గిరిజన నేతలకు ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ కల్పించే కుట్రను గిరిజన సంఘం వ్యతిరేకిస్తుందన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడు పోయిన గిరిజన ప్రజా ప్రతినిధులపై పోరాటం ఉదృతం చేయాలని అన్నారు.
హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం పేరుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గిరిజనుల అధీనం లో ఉన్న 15వేల ఎకరాల అటవీ భూమి ను అదానీ, శిర్డి సాయి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కు అప్పగించాలని వైసిపి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం అప్పగించాలని మోడీ ప్రభుత్వ ఆదేశాల మేరకే కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అనుమతి కుడా మంజూరు చేశారని, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలను అడవి నుండి గెంట్టివేత కు కేంద్ర ప్రభుత్వ అటవీ సంరక్షణ చట్టం సవరణ ను 2023 పిబ్రవరి లో జరిగిన పార్లమెంట్ సమావేశం నిర్ణయం చేశారని అన్నారు. గిరిజనులు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సవరిస్తున్న అటవీ సంరక్షణ ముసాయిదాపై ఈ రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు స్పందించాలని గిరిజనులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీల అటవీ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా నిర్ణయం చేయడం సరికాదు.
అల్లూరి సీతారామరాజు పేరుతో గిరిజన జిల్లా ఏర్పాటు చేసిన వైసిపి ప్రభుత్వం గిరిజన హక్కులు, చట్టాలు ఉల్లంఘించడం లో ముందు ఉందనీ, రాజకీయ లబ్దికోసం రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు రేపిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై ఉద్యమం నిర్వహించాలని ప్రజాతంత్ర వాదులకు,గిరిజనులకు పిలుపు ఇచ్చారు. నిమ్మలపాడు మైనింగ్ పై గిరిజనులందరూ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని చింతపల్లి ప్రాంతంలో గిరిజను నష్టం చేస్తూ సాగిస్తున్న తెల్లరైవాడిని అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షడు పి లక్కు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయి పడాల్,గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి కూడా రాధాకృష్ణ,గిరిజన సంఘం జిల్లా నాయకులు ఎంఎం శ్రీను నరసయ్య, రామన్న, సత్యనారాయణ,బొజ్జన్న,చిన్న, బాబు నాయుడు,పి బాల దేవ్, రామారావు, బుచ్చిబాబు, కొండలరావు,సుబ్బారావు, తదితరులతోపాటు గిరిజనులు పాల్గొన్నారు.