- బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్ లో శింగనమల అసెంబ్లీ బిజెపి కన్వీనర్ డి రవిరాజ్ ఆధ్వర్యములో ప్రజా ఛార్జ్ షీట్ దాఖలు
- ప్రజల ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతాం ..
- భారతీయ జనతా పార్టీ శింగనమల నియోజకవర్గం లో ప్రజల సమస్యల మీద , రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చనందున ప్రజా ఛార్జి షీటు దాఖలు చేసారు.
అనంతపూర్ జిల్లా బుక్కరాయసముద్రములో వైసిపి ఎమ్యెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఎన్నో హామీలు ప్రజలకు వరాల జల్లులు కురిపించారు. కానీ ఎమ్యెల్యే అయిన తర్వాత వాగ్దానాలను విమర్శించారు. పేరుకే ఎస్సి ఎమ్యెల్యే అని మొత్తం వారి వర్గానికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. ఎన్నికల వాగ్దానములో భాగంగా నిరుద్యోగులకు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి చేతులెత్తాశారని విమర్శించారు. రైతులకు 12500 ఇస్తామని చెప్పి నట్టేట మంచారని విమర్శించారు. మండలములో భూకబ్జాలు పెరిగిపోతున్నాయని అన్నారు . రేషన్ షాపులో బియ్యం ,కందిపప్పు , చక్కర గత కొన్ని నెలలుగా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ హామీలన్నీ విస్మరించినందుకు రాష్ట్ర ప్రభుత్వం పై ఛార్జి షీటు దాఖలు చేయాలనీ బుక్కరాయ సముద్రము పోలిష్ స్టేషన్ ఛార్జి షీటు దాఖలు చేసారు. కార్యక్రమములో కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సూర్య , అసెంబ్లీ నాయకులు గోపాల్ , శివ, రాజశేఖర్ తదితరులు పాల్గిన్నారు